రాయికోడ్, నవంబర్ 6: ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేస్తున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో చేరానని రాష్ట్ర మైనార్టీ నాయకుడు మహ్మద్ సుల్తాన్ అన్నారు. సోమవారం సింగీతం గ్రామానికి చెందిన మహ్మద్ సుల్తాన్ తన అనుచరులతో కలిసి హైదరాబాద్‌లోని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు నివాసంలో రాష్ట్ర పరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్ తన్వీర్ ఆధ్యర్యంలో బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం మహ్మద్ సుల్తాన్ మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, మైనార్టీలకు అందజేస్తున్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో లేవని కొనియాడారు. రాయికోడ్ మండలంలోని అన్ని గ్రామాల్లో మైనార్టీలను ఏకం చేసి అందోల్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌ను భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రత్యేక కృషి చేస్తామన్నారు. ఆయన వెంట నర్సింగ్‌రావు, తుల్జయ్య, ఎండీ మోహిన్, యూసుఫ్, శారీఫ్ తదితరులు ఉన్నారు.