రాయపోల్ : అనుమతి ఉన్న కంపనీల విత్తనాలు( Seeds ) ,ఎరువులు( Fertilizers ) , పురుగు మందులను మాత్రమే విక్రయించాలని వ్యవసాయ అధికారులు రైతులకు సూచించారు.
సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల దుకాణాల డీలర్లతో వ్యవసాయ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. వరిలో నాణ్యమైన సన్న రకాలను ఎక్కువ మొత్తంలో అందుబాటులో ఉంచాలని సూచించారు.
విత్తనాలు, ఎరువులు,పురుగు మందుల లైసెన్స్‌లు , స్టాక్ రిజిస్టర్లు, బిల్లు బుక్‌లను నిర్వహించాలని తెలిపారు. ధరలు, స్టాక్ బోర్డులను షాపు ఎదుట ఏర్పాటు చేయాలని కోరారు. దుకాణ యజమానుల నుంచి రైతులు తప్పనిసరిగా రశీదులను తీసుకోవాలని వెల్లడించారు. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై పీడీ యాక్ట్‌ను అమలు చేస్తామని హెచ్చరించారు. అధిక ధరలకు విత్తనాలు, ఎరువుల విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని వివరించారు. ఈ సమావేశంలో మండల వ్యవసాయ అధికారి నరేష్, ఎస్సై దేవయ్య, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.