Python | నర్సాపూర్, ఆగస్టు 19 : నర్సాపూర్ పట్టణ సమీపంలోని రాయారావు చెరువులో మత్స్యకారులు చేపల కోసం వేసిన వలలో కొండచిలువ చిక్కుకుంది. దీంతో అప్రత్తమైన మత్స్యకారులు అటవీ శాఖ అధికారులకు సమాచారమందించారు. అటవీ శాఖ అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని వలలో చిక్కుకున్న కొండచిలువను ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ వారి సహకారంతో బయటకు తీశారు.
అనంతరం కొండచిలువను అటవీ శాఖ అధికారులు సురక్షితంగా సంరక్షణ కేంద్రానికి తరలించారు. అనకొండ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొట్టుకుని వచ్చి చెరువులోకి వచ్చి ఉంటుందని ఈ సందర్భంగా ఎఫ్ఆర్ఓ అరవింద్ అన్నారు. ఈ స్నేక్ రెస్క్యూ ఆపరేషన్లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అరవింద్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సాయిరాం, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గోపాల్ రెడ్డి, బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు.
Vice president | ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ జడ్జి..!
Yellampally project | ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పై నుంచి రాకపోకలు బంద్
TLM Mela | టీఎల్ఎం మేళాతో బోధన సులభతరం : ఎంఈవో చంద్రశేఖర్ రెడ్డి