కంగ్టి, జూలై 17 : వర్షం కురువాలని ప్రార్థిస్తూ కంగ్టిలో గురువారం స్థానిక హనుమాన్ ఆలయంలో జలాభిషేకం నిర్వహించారు. ఈసందర్భంగా గ్రామానికి చెందిన ప్రజలు 1008 నిండు బిందెలతో హనుమంతుని విగ్రహానికి జలాభిషేకం నిర్వహించి, జపం చేపట్టారు. గ్రామ పురోహితుడు అక్షయ్ జ్యోషి ఆధ్వర్యంలో ఆలయంలో అర్చన, అభిషేకం తదితర ప్రత్యేకపూజ కార్యక్రమాలు చేపట్టారు. వర్షకాలం ప్రారంభమై నెలరోజులు కావస్తున్న ఇంకా వర్షాలు సక్రమంగా కురువడం లేదు. దీంతో గ్రామంలోని హనుమంతుని విగ్రహానికి జలాభిషేకం చేస్తే సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని గ్రామప్రజల నమ్మకం. జలాభిషేకం తరువాత ఆలయ ఆవరణలో నిర్వహకులు అన్నదానం నిర్వహించారు. కంగ్టి పట్టణంలోకి వ్యాపారస్థులు స్వచ్చందంగా తమ దుకాణాలను మూసివేశారు.