సిద్దిపేట, డిసెంబర్ 30(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కసరత్తు జరుగుతుంది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాల యంత్రాంగాలు ఆ పనిలో నిమగ్నమయ్యాయి. వారం పది రోజుల నుంచి ఏర్పాట్లను ముమ్మరం చేసింది. జిల్లాల్లోని గ్రామాల వారీగా ఓటరు జాబితాలను ఇప్పటికే గ్రామ పంచాయతీల్లో విడుదల చేశారు. గ్రామాల వారీగా పోలింగ్ కేం ద్రాలు, ఓటర్లు తదితర పనులు పూర్తి చేసింది. పంచాయతీ ఎన్నికల నిర్వహణ సజావుగా జరిగేందుకు కొం తమంది అధికారులను నోడల్ అధికారులుగా నియమించి వారికి బాధ్యతలను సైతం అప్పగించింది. వీరి నేతృత్వంలో పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పని విభజన చేసింది.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు జిల్లా అధికార యంత్రాంగం చెబుతోంది. ఇప్పటికే జిల్లా పం చాయతీ ఎన్నికల నిర్వహణకు చేయాల్సిన ఏర్పాట్లపై జిల్లాలకలెక్టర్లు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే. రిజర్వేషన్లపై ఒక స్పష్ట త వస్తే ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం అయినట్లే. ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా జిల్లాల అధికార యంత్రాంగాలు సిద్ధంగా ఉండే విధంగా చకచకా ఏర్పా ట్లు జరుగుతున్నాయి. గ్రామాల్లో పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో ఏడాది కాలంగా ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతుంది. దీంతో గ్రామాలకు ఎలాంటి నిధులు రాక పారిశుధ్యం, ఇతర పనులు ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయి. కాంగ్రెస్ పాలనలో నయా పైసా రాక గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు.
సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నా యి. పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా అధికారులకు బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల సిబ్బంది నియామకం, ఎన్నికల ప్రవర్తనా నియమావళి, బ్యాలెట్ బాక్స్‌ల నిర్వహణ, రవాణా, పోలింగ్ అధికారులకు శిక్షణ, ఎన్నికల సామగ్రి తరలింపు, ఎన్నికల వ్యయ పర్యవేక్షణ, బ్యాలెట్ పత్రాల ముద్రణ, మిడియా కమ్యూనికేషన్, హెల్ప్‌లైన్ తదితర పనుల నిర్వాహణ సజావుగా జరిగేవిధంగా జిల్లా అధికారులను నోడల్ అధికారులుగా నియమించారు.
వీరి నేతృత్వంలో ఆ యా విభాగాల్లో పనులు జరగనున్నాయి. ఈ 12 విభాగాలకు సిద్దిపేట జిల్లాలో 18 మంది, సంగారెడ్డి జిల్లా లో 12 మంది, మెదక్ జిల్లాలో 12 మందిని నోడ ల్ అధికారులుగా నియమించారు. ఎన్నికల నిర్వహణకు వచ్చిన మెటీరియల్‌ను వీరు సరి చూసుకుంటున్నారు. జిల్లాకు అవసరమైన బ్యాలెట్ బాక్స్‌లు ఆయా కలెక్టరేట్ల సమీపంలోని గోదాంలో నిక్షిప్తంగా ఉంచారు. ఆ బ్యాలె ట్ బాక్స్‌లు సరిగ్గా ఉన్నాయా..? లేవా అని సరిచూస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు సరిపడా సామ గ్రి జిల్లాలకు చేరుకుంది. సిద్దిపేట జిల్లాలోని 23 గ్రామ పంచాయతీలకు సంబంధించిన ముసాయిదా జాబితా ఇం తవరకు విడుదల కాలేదు.
కొన్ని సాంకేతిక కారణాలతో విడుదల కావడం లేదని అధికారులు చెబుతున్నారు. మరో వైపు ఆ గ్రామాల్లో ముసాయిదా జాబితా విడుదల కాకపోవడంతో ఒక రకంగా సందిగ్ధత ఏర్పడింది అని చెప్పవచ్చు. సిద్దిపేట నియోజకవర్గంలోని సిద్దిపేట రూరల్ మండలానికి చెందిన 15 గ్రామాలు ఉన్నాయి. వీటితో పాటు తొగుట మండలంలోని మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లో ముంపునకు గురైన ఎనిమిది గ్రామాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఎనిమిది గ్రామాలకు గజ్వేల్ వద్ద ఆర్అండ్ఆర్ కాలనీలను కట్టించారు. ముంపు గ్రా మాలకు సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్ చట్టాన్ని సవరించడంతో రిజర్వేషన్లు మారే అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటు మరి కొన్ని నిబంధనలు అమలులోకి రానున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్ల పాటు ఒకే రిజర్వేషన్ ఉండేలా చట్టం చేసి గ్రామ పంచాయతీల రిజర్వేరేషన్లను పూర్తి చేసి ఎన్నికలు నిర్వహించిన విష యం తెలిసిందే. ఈ చట్టం ప్రకారం ఈ విడత కూడా అదే రిజర్వేషన్ ప్రకారం ఎన్నికలు జరగాలి. కానీ కాం గ్రెస్ ప్రభుత్వం తాజాగా శాసనసభలో పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించడంతో రిజర్వేషన్లు మారనున్నాయి.
చట్ట సభలో బిల్లు ఆమోదం కావడంతో పంచాయతీ ఎన్నికల్లో పలు ప్రాధాన్యతలు చోటు చేసుకోనున్నాయి. ఇప్పటికే గ్రామాల్లో ఆశావహులు తమ అనుచరులతో సమావేశాలు నిర్వహించుకోవడం, రిజర్వేషన్ మనకే అనుకూలంగా వస్తుంది అంటూ లెక్కలు వేసుకోవడం.. ఒకవేళ మనకు అనుకూలంగా రాకపోతే ఏం చేయాలి… రిజర్వేషన్ అనుకూలంగా వస్తే నాకు సపోర్టు చేయాలి. ఒక వేళ నీకు అనుకూలంగా వస్తే నీకు సపోర్టు చేస్తా అం టూ ఇప్పుడే గ్రామాల్లో సంప్రదింపులు చేసుకుంటున్నారు. యువతను మచ్చిక చేసుకునే పనిలో కొంత మంది ఆశావహులు ఉన్నారు. ఇలా ఏదో ఒక రకంగా గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడి కనిపిస్తున్నది.