Pre School Graduation Day | రాయపోల్, ఏప్రిల్ 26 : దౌల్తాబాద్ మండల కేంద్రంలోని వీఎన్ఆర్ గార్డెన్లో ఇవాళ దుబ్బాక ప్రాజెక్టు ఐసీడీఎస్ దౌల్తాబాద్ మండల స్థాయి అంగన్వాడీ టీచర్ల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రీస్కూల్ గ్రాడ్యుయేషన్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా అంగన్వాడీ పిల్లలు అతిథులకు పుష్ప గుచ్చం అందించి స్టేజి పైకి ఆహ్వానించారు.
అలాగే పిల్లల వెల్కమ్ సాంగ్ ప్రదర్శన చేసిన తర్వాత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలకు ప్రీస్కూల్ మెటీరియల్ ప్రదర్శిస్తూ.. తల్లిదండ్రుల ఆధ్వర్యంలో ఆట, పాటల కార్యక్రమాలను నిర్వహించారు. అలాగే స్కూల్ పిల్లలకు ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వడం జరిగింది. పిల్లల తల్లిదండ్రులు వారి పిల్లల ఆటలు, పాటలు, నాటకీయ ప్రదర్శనలు చూసి చాలా మురిసిపోయారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ విధంగా పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలకు దోహదపడే యాక్టివిటీలు అంగన్వాడీ సెంటర్లలో చేయడం చాలా సంతోషకరమన్నారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖర్ , సీడీపీఓ ఎల్లయ్య , ఎంపీడీవో వెంకట లక్ష్మమ్మ, మెడికల్ ఆఫీసర్ నాగరాజు , రిలయన్స్ డిస్టిక్ కోఆర్డినేటర్ రాజలింగం , పోషణ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ వెంకటప్రసాద్, బ్లాక్ కో ఆర్డినేటర్ శ్యాంసన్ ,రిలయన్స్ ఫౌండేషన్ బ్లాక్ కో ఆర్డినేటర్ భాస్కర్ , సరిత నాగరాజు, జిల్లా మహిళా సాధికారిక సంస్థ , దౌల్తాబాద్ మండలం సూపర్వైజర్ గిరిజ ,చంద్రకళ ,అంతుల్, రేణుక, స్వరూప, రాజేశ్వరి, హెల్త్ సూపర్ వైజర్ గీతబవని,లబ్దిదారులు ,పిల్లలు, వారి తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.
Palvancha : కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటున్న తెలంగాణ సమాజం : మాజీ మంత్రి వనమా
Amberpet | రజతోత్సవానికి రెడీ.. అంబర్పేటలో ముందే మురిసిన గులాబీ జెండా