Prajavani | రామాయంపేట, మార్చి 24 : ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టిందని తహసీల్దార్ రజినీకుమారి పేర్కొన్నారు. ఇవాళ ప్రజావాణి సందర్బంగా తహసీల్దార్ కార్యాలయంలో ధరఖాస్తులను స్వీకరించారు.
అనంతరం తహసీల్దార్ రజినీకుమారి మాట్లాడుతూ.. రామాయంపేట పట్టణ, మండల ప్రజలందరూ తమ సమస్యలు ఏమున్నా నేరుగా ప్రతీ సోమవారం మండల కేంద్రంలో జరిగే ప్రజావాణిలో ఫిర్యాదును అందజేయాలన్నారు. ప్రజావాణికి వచ్చిన ధరఖాస్తులకు సాధ్యమైనంత మేర కార్యాలయంలోనే పరిష్కారం జరుగుతుందని.. ఇక్కడ పరిష్కారం కాకపోతే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యలకు పరిష్కారం చూపడం జరుగుతుందన్నారు.