నమస్తే తెలంగాణ ఫొటోగ్రాఫర్,సంగారెడ్డి జిల్లా, మార్చి 29 : కరెంట్ కోతలు కర్షకులకు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. వ్యవసాయరంగానికి 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నా ఎక్కడా అమలుకావడం లేదు.దీంతో సంగారెడ్డి జిల్లాలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కరెంట్ ఎప్పుడు వస్తదో, ఎప్పుడు పోతదో తెల్వక పొలాల్లోనే రైతులు పడిగాపులు కాయాల్సి వస్తున్నది. ఇచ్చే కరెంట్‌తో పొలాలకు సరిపడా నీళ్లు అందించలేక అవస్థలు పడుతున్నామంటూ రైతులు వాపోతున్నారు.బోరుమోటర్లు కాలిపోయి నష్టాలు చవిచూస్తున్నారు. పొలాలు ఎండిపోతున్నాయి.