మెదక్‌లో పోలింగ్ 86.69 %
మెదక్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మెదక్ జిల్లా వ్యాప్తంగా నమోదైన పోలింగ్ 86.69 శాతం నమోదైందని అధికారులు వెల్లడించారు. గురువారం జిల్లా వ్యాప్తంగా పోలింగ్ సిబ్బంది ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు ప్రశాంతంగా కొనసాగింది.
- ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
- మెదక్ జిల్లా వ్యాప్తంగా 86.69% పోలింగ్
- ఊరూర పోలీసు, పారామిలటరీ బలగాలు
- పోలింగ్ బూత్‌లను సందర్శించిన మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి
- పోలింగ్ బూత్‌ను పరిశీలించిన ఎన్నికల జిల్లా ఎన్నికల అబ్జర్వర్ సంజయ్‌కుమార్, మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని
మెదక్ రూరల్/మెదక్ అర్బన్/రామాయంపేట/ రామాయంపేట రూరల్/రేగోడ్/నిజాంపేట/పాపన్నపేట/చిన్నశంకరంపేట, నవంబర్ 30: మెదక్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మెదక్ జిల్లా వ్యాప్తంగా నమోదైన పోలింగ్ 86.69 శాతం నమోదైందని అధికారులు వెల్లడించారు. గురువారం జిల్లా వ్యాప్తంగా పోలింగ్ సిబ్బంది ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు ప్రశాంతంగా కొనసాగింది. ఎన్నికల్లో భాగంగా మెదక్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి రామాయంపేట పురపాలికతో పాటు అన్ని గ్రామాల్లోని పోలింగ్ బూత్‌లను పరిశీలించి అక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకులను పోలింగ్ సరళిని తెలుసుకున్నారు.

ఈ ఎన్నికల్లో నూతనంగా ఓట్లు పొందిన యువతీ, యువకులు ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. పోలింగ్ బూత్‌ల పనితీరును జిల్లా ఎన్నికల అబ్జర్వర్ సంజయ్‌కుమార్, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, మండల ఎన్నికల అధికారులు రజనీకుమారి, ఉమాదేవి పర్యవేక్షించి సిబ్బందికి సూచనలు చేశారు. పాపన్నపేట మండల పరిధిలోని 58 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, దాదాపు అన్ని పోలింగ్ కేం ద్రాల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నిజాంపేట మండల వ్యాప్తంగా 28 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. మెదక్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అభ్యర్థి మండలంలోని పలు గ్రామాల పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ ప్రక్రియ పరిశీలించారు.

కల్వకుంటలో బీఆర్ఎస్ జిల్లా ఎన్నికల ఇన్చార్జ్ కంఠారెడ్డి తిరుపతిరెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల పోలింగ్ బూత్ నంబర్ 131 వద్ద ఓటు హక్కును వినియోగించుకొని వస్తున్న బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గంగాధర్‌పై, మాజీ కో అప్షన్ మెంబర్ సాధిక్లపై కాంగ్రెస్ నాయుకులు అరిఫ్ జలీల్, మహ్మద్ జమీయొద్దీన్, సయ్యద్ తాహెర్ అలీ, ఎంఏ ఖాలీజ్లు ఆర్అండ్బీ రోడ్డు వద్ద బండిపై వస్తుండగా దాడి చేశారని గంగాధ ర్ తెలిపారు. కాంగ్రెస్ దాడి చేసిన కాంగ్రెస్ నాయకులపై మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

