Chalivendram | టేక్మాల్, మార్చి 19 : వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రాలను ప్రారంభించడం అభినందనీయమని మాజీ జెడ్పీటీసీ సర్వని సరోజ పేర్కొన్నారు. మండల కేంద్రమైన టేక్మాల్ ఫోటో ఫన్ యాజమాన్యం ఆధ్వర్యంలో గత కొన్నేళ్లుగా చలివేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఇవాళ ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్వని సరోజ మాట్లాడుతూ.. మానవ సేవయే మాధవ సేవ అని భావించి గత కొన్నేళ్లుగా ఫోటో ఫన్ యాజమాన్యం చలివేంద్రాన్ని నిర్వహించడం సంతోషకరమైన విషయమన్నారు. బస్టాండ్ సమీపంలో ఉన్న చలివేంద్రం వల్ల ప్రయాణీకులు, బాటసారుల దాహార్తిని మండు వేసవిలో తీర్చడమనే సేవా కార్యక్రమం చేపట్టడం మహోన్నతమైన విషయమని కొనియాడారు.
ఇలాంటి సేవాకార్యక్రమాలను మరిన్ని చేయడానికి యువత ముందుకు రావాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఫోటో ఫన్ యజమాని మజ్హర్, జోగిపేట మార్కెట్ కమిటి వైస్ ఛైర్మన్ సత్యనారాయణ, నాయకులు రమేష్, పాపయ్య, మల్లారెడ్డి, విష్ణువర్ధన్, సక్రునాయక్, మహేష్ రెడ్డి, సంగమేష్ గౌడ్, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.