Ration | చిలిపిచెడ్, జూన్ 13: మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలంలోని ఆయా గ్రామాల్లో రేషన్ బియ్యం కోసం లబ్ధిదారులు పడిగాపులు కాస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక్కొక్క లబ్ధిదారునికి మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఒక్కో లబ్ధిదారుడు ఈపీడీఎస్ మిషన్పై ఆరుసార్లు వేలిముద్ర వేయాల్సి వస్తుంది. ఈ ప్రాసెస్ మొత్తం జరగడానికి చాలా సమయమే తీసుకుంటుంది. దీంతో రేషన్ కోసం వచ్చిన లబ్ధిదారులు గంటల తరబడి రేషన్ షాపుల వద్దే పడిగాపులు పడాల్సి వస్తుంది.
ఇప్పుడే పిల్లలకు పాఠశాలలు, కాలేజీలు ప్రారంభమయ్యాయి. అలాగే గ్రామాల్లో వ్యవసాయ పనులు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. ఇలాంటి తరుణంలో రోజంతా రేషన్ షాపుల వద్ద ఎదురుచూడటం వల్ల పనికి వెళ్లలేకపోతున్నామని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్, సివిల్ సప్లై అధికారులు చర్యలు తీసుకుని, త్వరగా రేషన్ బియ్యం ఇచ్చేలా చూడాలని లబ్ధిదారులు కోరుతున్నారు.