Land issues | చేగుంట, జూన్05 : గ్రామానికి వచ్చే అధికారులకు సహకరించి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించుకోవాలని చేగుంట తహసీల్దార్ శ్రీకాంత్ పేర్కొన్నారు. చేగుంట మండలపరిధిలోని పులిమామిడి,కిష్టపూర్ గ్రామంలో గురువారం నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో గ్రామంలోని పలువురు రైతులకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించి, కొన్ని దరఖాస్తులను అక్కడిక్కడే పరిష్కరించారు.
ఈ సందనర్భంగా తహసీల్దార్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం భూ భారతి కార్యక్రమాన్ని చెపట్టిందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులు తమ భూముల సమస్యల కోసం అర్జీలను సమర్పించినట్లయితే వాటిని పరిశీలించి నిబంధనల మేరకు సమస్యల పరిష్కారం కోసం తగు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో చేగుంట తహసీల్దార్ శ్రీకాంత్‌తో పాటు,డిప్యూటి తహసీల్దార్ స్వప్న,ఆర్ఐలు జైభారత్‌రెడ్డి,సంతోష్‌రావు,సర్వేయర్ రవీందర్‌రెడ్డి,పంచాయతీ కార్యదర్శులు,రెవెన్యూ సిబ్బంది,రైతులు తదితరులు పాల్గొన్నారు.
Collector Manu Chowdhury | రైతు మహోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ మను చౌదరి
Innovation Marathon | స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్‌కు సెయింట్ మేరీస్ పాఠశాల ఎంపిక
Harish Rao | బడా బాబుల కోసం బీద రైతుల కడుపు కొడుతారా..? రేవంత్ రెడ్డిని నిలదీసిన హరీశ్‌రావు