ఝరాసంగం, జనవరి 27: సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని మేదపల్లికి చెం దిన మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది యువకులు పాదయాత్రగా కేసీఆర్ను కలిసేందుకు సోమవారం సంగమేశ్వరాలయంలో పూజలు నిర్వహించారు. బీఆర్ఎస్ అధినేత నిండునూరేండ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామి వారికి అభిషేకం, మహా మంగళహారతి వంటి ప్రత్యేక పూజలు చేశారు. నాలుగు రోజులపాటు సాగే పాదయాత్ర గజ్వేల్ మీదుగా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫౌమ్హౌస్ వరకు 140 కిలోమీటర్లు సాగునున్నది. ఈ పాదయాత్రను జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ వారికి గులాబీ కండువాలు కప్పి పూలమాలతో సన్మానించి ప్రారంభించారు.
తెలంగాణ జాతిపిత కేసీఆర్పై ఉన్న అభిమానంతో పాదయాత్రగా వెళ్తున్న పరమేశ్వర్ పాటిల్ బృందానికి ఎక్కడా సమస్య రాకుండా అన్ని విధాలుగా చూసుకుంటామని ఎమ్మెల్యే , డీసీఎంఎస్ చైర్మన్ తెలిపారు. ఈ సందర్భంగా పరమేశ్వర్ మాట్లాడుతూ…కేసీఆర్ అంటే నాకు ఇష్టం. ఆయన పాలన చాలా బాగుంటుంది. పదేండ్లలో రా్రష్ట్రం విలువను వందరెట్లు పెం చారన్నారు. ఆయన లేనిలోటు ప్రజలకు స్ప ష్టంగా తెలుస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కేసీఆర్కు వివరిస్తానన్నారు.
ఒక్కడుగు ముందుకేసి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిన జాతిపితను కలుసుకోవాలనే సంకల్పంతో ఈ పాదయాత్ర చేస్తున్నానని తెలిపారు. ఆయన ఉద్యమం ముందు నా పాదయాత్ర చాలా చిన్నదని, నా పాదయాత్రకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యే, డీసీఎంఎస్ చైర్మన్కు రుణపడి ఉంటానన్నారు. పాదయాత్రకు బస్వరాజ్, ప్రశాంత్, మారుతి, చంద్రయ్య, మాణిక్, వెంకట్, సతీశ్, పాండు, బోయిని పాండు, విజయ్, శ్రీనివాస్, మోహన్, అవుసలి బస్వరాజ్, రాము, అశోక్, శివు, వీరన్న, గోపాల్, దత్తు, ప్రదీప్, నవీన్, రాషాబ్ షకీల్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు వెంకటేశం, జగదీశ్వర్, ఎజాజ్ బాబా, సోహెల్, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.