Villages Fund | రామాయంపేట మండలంలో గ్రామ పంచాయతీల పరిస్థితి దీనస్థితిలో ఉన్నాయి. ఇప్పటికే చేపట్టిన పనులకు బిల్లులు రాక లక్షల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. కనీసం పారిశుధ్య సిబ్బందికి జీతాలు ఇవ్వడానికి కూడా పంచాయతీలో చిల్లిగవ్వలేదు. ఈ విషయంలో ఆందోళన చేయడం వల్ల గత ఏడాది డిసెంబర్ వరకు జీతాలు ప్రభుత్వం మంజూరు చేసింది. సర్పంచుల కాలం ముగిసి ప్రత్యేక అధికారుల ఆధీనంలోకి వెళ్లిన గ్రామపంచాయతీలకు. ఇప్పుడు ఆర్థిక భారం పెను సవాల్ గా మారింది.
పాలకవర్గాలు లేని పంచాయతీలో బాధ్యతల భారం కార్యదర్శులకు తలనొప్పిగా మారింది. ప్రస్తుతం పంచాయతీ పాలనలో తామే కీలకంగా కావడంతో కార్యదర్శులు అడక్కత్తెరలో పోక చుక్కలా నలిగిపోతున్నారు. పంచాయతీ పనులకు అవసరమైన నిధులు లేక సొంతంగా ఇంకెంతకాలం ఖర్చులు భరించాలో తెలియక తల పట్టుకుంటున్నారు. ప్రత్యేక ఏర్పాట్లకు నిధులు తప్పనిసరి, ఈ పరిస్థితుల్లో పంచాయతీల్లో ప్రతీ పని ఆర్థికపరమైన అంశమే, రాష్ట్ర కేంద్ర, రాష్ట్ర నుండి సకాలంలో నిధులు అందక ఆర్థిక ఇబ్బందుల్లో పంచాయతీ కార్యదర్శులు నలిగిపోతున్నారు.
గత సంవత్సరం ఫిబ్రవరి నెల నుండి పంచాయతీ పాలకవర్గం ముగిసి.. కార్యదర్శులు, ప్రత్యేక అధికారుల పాలన మొదలైంది. ఇతర శాఖల్లో కీలకంగా ఉన్న గెజిటెడ్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించారు. అదనపు బాధ్యతలు అప్పగించడంతో వారు తీరిక ఉన్నప్పుడే గ్రామాలకు వెళ్లి వస్తున్నారు. పంచాయతీ ఆధ్వర్యంలో నడుస్తున్న చిత్త సేకరణ, వాటర్ ట్యాంకర్లకు అవసరమైన డీజిల్, పల్లె ప్రకృతి పనులు పారిశుద్ధ్య పనులు, చెత్త డంపింగ్ యార్డుల స్మశాన వాటిక నిర్వహణ పంచాయతీ కార్యదర్శులు నిర్వహిస్తున్నారు.
ఇదంతా తమకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని ఇలాంటి ఇబ్బందులు ఎప్పుడు పడలేదని పంచాయతీ పాలకవర్గం ఉంటే ఈ ఇబ్బందులు ఉండేవి కాదని పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Rashmi Gautam| రాజమండ్రిలోని గోదావరిలో అస్థికలు కలిపి ఫుల్ ఎమోషనల్ అయిన రష్మీ గౌతమ్
Nama Ravikiran | ఎల్ఆర్ఎస్పై మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం : బీఆర్ఎస్ నేత నామ రవికిరణ్
Nizampeta Farmer | రెండు బోర్లు వేసిన.. బొట్టు నీళ్లు పల్లేదంటూ నిజాంపేట యువ రైతు ఆవేదన