Panchayat Elections | టేకులపల్లి, నవంబర్ 25 : టేకులపల్లి మండలంలోని పంచాయతీ పోరు వేడెక్కుతోంది. తాజాగా వచ్చిన రిజర్వేషన్లతో గ్రామ రాజకీయాలు ఉపందుకున్నాయి. మండలంలో చాలా వార్డుల రిజర్వేషనలో ఓసీ, బీసీ, ఇతర అభ్యర్థులు, ఓటర్లు అధికంగా ఉన్న వద్ద ఎస్టీలకు రిజర్వేషన్ ఇవ్వడంతో పోటీదారుల్లో అయోమయం నెలకొంది. రిజర్వేషన్ వచ్చిన వార్డులో పోటికి నిలబడుదామంటే తమ వార్డు కానీ చోట గెలిచే పరిస్థితి ఉండదనే నిరుత్సాహంలో ఉన్నారు. గ్రామాల్లో ఆశావాహులు పార్టీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. పార్టీ కోసం కష్టపడ్డ వారికి సర్పంచ్ టికెట్ ఇవ్వాలని, కొత్తవారికి ఇస్తారేమోనని ఆశావాహుల్లో ఆందోళన నెలకొంది.
కొన్ని గ్రామ పంచాయతీల్లో పోటికి ఉన్న నేతలు ఒకరిపై ఒకరు పార్టీ పెద్దలతో ఫిర్యాదులు చేసుకుంటున్నారని సమాచారం. టేకులపల్లి మండలంలో 36 పంచాయతీల్లో సర్పంచ్ రిజర్వేషన్లు, 312 వార్డుల్లో… ఎస్టీ మహిళ ..తొమ్మిదొమైల్ తండా, బర్లగూడెం, బేతంపూడి, బిల్లుడుతండా, రోళ్ళపాడు, రామచంద్రునిపేట, తావుర్యాతండా, పెట్రాంచెలక, ముత్యాలంపాడు క్రాస్ రోడ్, మేళ్ళమడుగు, మద్రాస్తోండా, పీ కొత్తతండా, గొల్లపల్లి, చింతోని చెలక, గంగారం, చంద్రుతండా, బోడు, ఎస్టీ జనరల్….. టేకులపల్లి, తడికలపూడి, ఎర్రాయిగూడెం, బద్దుతండా, చుక్కాలబోడు, దాసుతండా, గోల్యాతండా, కిష్టారం, కొప్పురాయి, కుంటల్ల, లచ్చగూడెం, మొక్కంపాడు, పెగళ్లపాడు, రాంపురం, శంభూనిగూడెం, సులానగర్, రిజర్వేషన్లు ఇలా ఉన్నాయి.
ముగ్గురు పిల్లల నిబంధన తొలగింపుతో…
స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లల నిబంధన తొలగింపుతో అనేక మందికి మళ్లీ రాజకీయ అవకాశాలు లభించాయి. ఇన్ని రోజులు జెండా పట్టుకున్న నేతలను గెలిపించడం.. నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేయడంలో మునిగిన వారికి ఇప్పుడు పోటీ చేసే అవకాశం రావడంతో గ్రామాల్లో ఆశావాహుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల నుంచి పోటీలో నిలబెట్టే అభ్యర్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో టేకులపల్లి మండల రాజకీయాలు వేడెక్కగా.. ఎవరెవరికి అవకాశం దక్కుతుంది. ఎవరికి భంగపాటు కలుగుతుందో మరికొద్ది రోజుల్లో తేలనుంది.
Harish Rao | నీకు మహిళలు ఎందుకు ఓటెయ్యాలి.. సీఎం రేవంత్ రెడ్డిని నిలదీసిన హరీశ్‌రావు
Palash Muchhal | మళ్లీ ఆసుపత్రిలో చేరిన స్మృతి మంధానకు కాబోయే భర్త