Palle Prakruthi Vanam | రేగోడ్, జూలై 16 : పల్లె ప్రకృతి వనాన్ని రక్షించండని దోసపల్లి గ్రామానికి చెందిన గ్రామస్తులు బుధవారం వినతి పత్రం అందజేశారు. మంగళవారం రాత్రి అధికార పార్టీకి చెందిన బడా నాయకుడు ప్రకృతి వనాన్ని తొలగించాడని, ఆనవాళ్లు లేకుండా జేసీబీతో రాత్రికి రాత్రే ప్రకృతి వనాన్ని మొత్తం తొలగించారని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బుచ్చయ్య అన్నారు.
రేగోడ్ మండలంలోని ఎంపీడీవో, తహసీల్దార్, పోలీస్ స్టేషన్ల కార్యాలయాల్లో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని దోసపల్లి గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం చెట్లను పెంచాలని ఎంతో కృషి చేస్తుంటే మొత్తం వనాన్ని తొలగించారని గ్రామస్తులు ఆరోపించారు. ప్రకృతి వనాన్ని ధ్వంసం చేసిన వారిపై చర్యలే తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల బీఆర్స్ పార్టీ అధ్యక్షుడు బుచ్చయ్య, నాయకులు గురునాథ్ రెడ్డితోపాటు గ్రామస్తులు పేర్కొన్నారు.
Prada | చెప్పుల ప్రదర్శనతో వివాదం వేళ.. కొల్హాపూర్ని సందర్శించిన ప్రాడా ప్రతినిధుల బృందం
Viral video | లిఫ్టులో గ్యాంగ్ వార్.. తప్పతాగి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు.. చెంపదెబ్బలు..!
KCR | ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ మృతిపట్ల కేసీఆర్ సంతాపం