చేర్యాల, ఫిబ్రవరి 6: హామీలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లేదని, ఆరు గారెంటీలు, 420 హామీలు అమలు చేయని వారికి బుద్ధిచెప్పే సమయం ఆసన్నమైందని, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి కోరారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన చేర్యాల మున్సిపాలిటీలోని 4, 5, 6, 7, 8, 9 వార్డుల్లోని వివిధ కాలనీలు, శివారు పల్లెలో బీఆర్ఎస్ అభ్యర్థులు నిమ్మ సుప్రజరాజీవ్రెడ్డి, తొడెంగల రాజేశ్, ముస్త్యాల అరుణాబాలనర్సయ్య, మెరుగు లక్ష్మణ్‌గౌడ్, బూనాద్రి సురేశ్, వీరబత్తిని సత్యనారాయణ,సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, చేర్యాల ఎన్నికల ఇన్చార్జి ఎల్లు రవీందర్‌రెడ్డితో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డికి పరిపాలన చేతకాక చేతులెత్తేశాడన్నారు. చేర్యాల పట్టణంలో జరిగిన అభివృద్ధి కేవలం బీఆర్ఎస్ పాలనలోనే జరిగిందన్నారు.బీఆర్ఎస్ పార్టీని మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.