మెదక్ మున్సిపాలిటీ, మే 14 : రాష్ట్రంలో గిరిజన తండాలను పంచాయతీలుగా చేసిన ఘనత కేసీఆర్‌దేనని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం హవేళిఘనపూర్ మండలం దూప్‌సింగ్ తండాలో సంత్ సేవాలాల్ మహరాజ్ విగ్రహ ప్రతిష్ట మహోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గిరిజనుల ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహారాజ్ అన్నారు. సేవాలాల్ ఆలయం నిర్మించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు బంజారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి గిరిజన తండా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా కేసీఆర్ తీర్చిదిద్దారన్నారు. తండాలు పంచాయతీలుగా ఏర్పాటు కావడంతో అభివృద్ధికి తోడ్పడుతున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించక పోవడంతో పంచాయతీలు అభివృద్ధికి దూరమవుతున్నయన్నారు. ఈ సందర్బంగా ఆలయ కమిటీ సభ్యులు పద్మాదేవేందర్‌రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ ఉపాధ్యక్షురాలు లావణ్యరెడ్డి, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు సాయగౌడ్, సాయిలు, భిక్షపతిరెడ్డి, సాప సాయులు, బాలరాజు, మల్లయ్య, రవీందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.