రామాయంపేట : తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ పార్టీని మున్సిపల్ ఎన్నికల్లో ఆదరించాలని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
3వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోత్ శ్రీనివాస్ నాయక్ తరఫున ఇంటింటి ప్రచారం చేపట్టి మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమంలో మెదక్ నియోజకవర్గ ఇన్చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.