Paddy Crop | నిజాంపేట, మార్చి20 : కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ వ్యాప్తంగా అన్నదాతలు అరిగోసలు పడుతున్నారు. భూగర్భ జల మట్టం తగ్గిపోయి బోర్ల నుంచి నీళ్లు రాక సాగు నీరు కరువై రైతన్న ఆశలు ఆవిరైపోతున్నాయి. దిన దినం భూగర్భ జల మట్టం తగ్గిపోతుండటంతో బోర్ల నుంచి తక్కువగా నీళ్లు వస్తున్నాయి. అన్నదాతల ఆశలు రోజురోజుకీ సన్నగిల్లిపోతున్నాయి.
పంటలకు సరిపడా నీళ్లు అందక ఎండిపోయి పశువులకు మేతగా మారుతున్నాయి. నగరం గ్రామానికి చెందిన కాస్తి రాజు అనే రైతు రెండు ఎకరాల మేర వరి పంటను సాగు చేశాడు. అయితే రోజు రోజుకు బోరు నుంచి నీళ్లు రావడం తక్కువ అవుతుండటంతో అర్థ ఎకరం వరి చేను ఎండిపోయి జీవాలకు మేతగా మారింది.
పెట్టుబడి ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదని బాధిత రైతులు బాధపడుతున్నారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో రైతుల పరిస్థితి ఎట్లా ఉందో ఈ సంఘటన మరోసారి రుజువు చేస్తోంది.
Vishnupriya | బెట్టింగ్ యాప్ కేసు.. విష్ణుప్రియ ఫోన్ని సీజ్ చేసిన పంజాగుట్ట పోలీసులు