Paddy Crop | నర్సాపూర్, మార్చి19 : ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున వరి పంట ఎండిపోకుండా ప్రత్యామ్నాయ తడులు ఇచ్చుకుంటూ వరిని కాపాడుకోవాలని ఏడీఏ సంధ్యారాణి రైతులకు సూచించారు. ఇవాళ మండల పరిధిలోని లింగాపూర్, సీతారాంపూర్ గ్రామాలలో ఏడీఏ సంధ్యారాణి సందర్శించి వరి పంటను పరిశీలించారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఈ యాసంగిలో ఎండలు ఎక్కువగా ఉన్నందున వరి పైరులో నీటి యాజమాన్యం గురించి రైతులకు అవగాహన కల్పించడం జరిగిందని వెల్లడించారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున వరికి అవసరం మేరకు మాత్రమే నీరు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈవోలు దుర్గప్రసాద్, చంద్రవేణి, రైతులు పాల్గొన్నారు.