Paddy Crop Pest | వెల్దుర్తి, మార్చి 18 : రోజురోజుకు ముదురుతున్న ఎండల తీవ్రతతో వరి పంటకు తెగుళ్ల బెడద అధికంగా ఉంటుందని వెల్దుర్తి, మాసాయిపేట మండలాల వ్యవసాయ అధికారులు ఝాన్సీ, రామశివరావులు రైతులకు సూచించారు. ఇవాళ వ్యవసాయ అధికారులు ఆయా మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో తెగులు సోకిన, ఎండిపోతున్న వరి పంటలను రైతులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎండలు తీవ్రతరం కావడంతోపాటు భూగర్భ జలాలు పడిపోయాయని, పూర్తి స్థాయిలో పంటలు చేతికి వచ్చే పరిస్థితులు లేవని అన్నారు. కావున రైతులు ఉన్న నీటి వనరులకు అనుగుణంగా ఆరుతడిగా పంటలకు నీరు అందించాలని సూచించారు.
పంటకు అవసరం మేరకు, నీటిని వృధా చేయకుండా రోజు విడిచి రోజు పంటకు నీరు పెట్టాలని, వ్యవసాయ అధికారుల సూచనలతో వరి పంటలను కాపాడుకోవాలన్నారు. పంటకు తెగుళ్లు సోకితే వెంటనే వ్యవసాయ అధికారులను సంప్రదించి తెగుళ్ల నివారణకు మందులను పిచికారి చేయాలని అన్నారు. వీరి వెంట ఏఈఓలు మజీద్, రేవతి, రజిత, రైతులు ఉన్నారు.
MLC Kavitha | బీసీ రిజర్వేషన్ల బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు
Danam Nagender | సహచర ఎమ్మెల్యేలపై దానం నాగేందర్ సీరియస్
Amitabh Bachchan: షారూక్, విజయ్ను దాటేసిన బిగ్ బీ.. 120 కోట్ల ట్యాక్స్ కట్టిన అమితాబ్ బచ్చన్