Voter List | నర్సాపూర్, డిసెంబర్ 8 : ఓటర్ జాబితా సవరణ తర్వాత కూడా ఓటర్ జాబితాల్లో తప్పుల తడక తప్పడం లేదు. నర్సాపూర్ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామపంచాయతీ ఓటర్ జాబితాలో తప్పులు అధికారుల పనితీరును వేలెత్తి చూపిస్తున్నాయి. ఓటర్ జాబితాలో 40 మంది చనిపోయినా.. ఓటర్ల పేర్లు అలాగే 21 మంది ఓటర్ల పేర్లు రెండు సార్లు నమోదు కావడం జరిగింది. ఇదే కాకుండా ఓ ఓటర్ పేరు మూడు సార్లు నమోదు కావడం గమనార్హం.
ఓటర్ జాబితాల్లో తప్పులు ఉన్నాయని గతంలో వివిధ దినపత్రికలలో ప్రచురితమైనా ఎలాంటి మార్పు లేకుండా అధికారుల నిర్లక్ష్యంతో ఓటర్ తుది ఓటర్ జాబితా అలానే ముద్రించడం జరిగింది. అలాగే గ్రామంలో లేని వ్యక్తి పేరు కూడా ఓటర్ జాబితాలో పొందుపరచడం జరిగింది. ఎన్నికల సమయంలో దొంగ ఓట్లు పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని సర్పంచ్ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా ఈ గ్రామంలో 10 మంది అభ్యర్థులు సర్పంచ్ పోటీకి నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది.
ఒక వేళపై ఓట్లలో ఏ ఒక్క ఓటు పడ్డా గ్రామంలో గొడవలు జరిగే అవకాశాలున్నాయని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చనిపోయిన వారి ఓట్లను, అలాగే డబుల్ ఓట్లను తొలగించేలా ఏదైనా చర్యలు తీసుకోవాలని అభ్యర్థులు, గ్రామస్తులు కోరుతున్నారు. ఈ విషయంపై ఆర్డీవో మహిపాల్ రెడ్డిని వివరణ కోరగా.. ఓటర్ స్లిప్పులను పంచేటప్పుడు చనిపోయిన వారి పేర్లను తొలగిస్తామని, అలాగే డబుల్ ఉన్న వారికి ఒకటే స్లిప్పు అందజేస్తామని వెల్లడించారు.
ఎన్నికలు జరిగే సమయంలో చనిపోయిన వారి పేర్లు, డబుల్ ఉన్న పేర్లను అధికారులకు అందజేసి ఓట్లు పడకుండా చూస్తామన్నారు. ఓటర్ లిస్ట్ ఒకసారి ప్రింట్ అయ్యాక అందులో పెన్ను పెట్టి సవరించే అధికారం మాకు లేదని ఆర్డీవో మహిపాల్ రెడ్డి వెల్లడించారు.
ItsOkayGuru | ‘ఇట్స్ ఓకే గురు’ తప్పకుండా అందరినీ అలరిస్తుంది : మెహర్ రమేష్
Hyderabad | అంత్యక్రియలకు డబ్బుల్లేక మృతదేహంతో మూడు రోజులు
ICC | భారత క్రికెటర్లకు షాకిచ్చిన ఐసీసీ.. మ్యాచ్ ఫీజులో భారీ కోత..!