ఎదులాపురం, ఫిబ్రవరి 21 : పుదుచ్చేరిలోని ప్రతిష్టాత్మక జిప్మర్ సంస్థ నిర్వహించిన వర్ షాప్లో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలోని ఎస్ఎన్సీయూ విభాగం ప్రథమ బహుమతితోపాటు రూ.5 వేల రివార్డు సాధించడంపై కలెక్టర్ రాజర్షి షా హర్షం వ్యక్తం చేశారు. ఇన్ఫెక్షన్ కంట్రోల్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ఇనిషియేటివ్ ప్రాజెక్టులో భాగంగా రిమ్స్ బృందం ప్రదర్శించిన ప్రతిభకు ఈ జాతీయ స్థాయి గుర్తింపు లభించిందని పేరొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జైసింగ్ పర్యవేక్షణ, హాస్పిటల్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ టీం సభ్యురాలు డాక్టర్ పద్మవల్లి, సిమ్మి కుమారి, డాక్టర్లు తంగాయి నాథన్, అనంత్ రావు, ఎస్ఎన్సీయూ బృందం సమష్టిగా కృషి చేసి శిశు ఆరోగ్య విభాగంలో ఇన్ఫెక్షన్ల రేటును గణనీయంగా తగ్గించడంలో అద్భుతమైన ఫలితాలను సాధించారని కొనియాడారు.
ఈ వర్షాప్లో ఇన్ఫెక్షన్ కంట్రోల్ నర్సింగ్ ఆఫీసర్ సీంనీ కుమారి సమర్పించిన పోస్టర్ ప్రదర్శన అందరిని ఆకట్టుకొని మొదటి బహుమతికి ఎంపికైందని ఆయన తెలిపారు. ఇదే స్ఫూర్తితో జిల్లాలో వైద్య సేవలను మెరుగుపరిచి, సామాన్యులకు నాణ్యమైన చికిత్స అందించాలని రిమ్స్ బృందాన్ని కలెక్టర్ అభినందించారు.