మెదక్ : రెండు బైకులు ఢీ కొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన నార్సింగి మండల శివారులోని 44వ జాతీయ రహదారి పై చోటు చేసుకుంది. మృతుడు చిన్న శంకరంపేట మండలంలోని మీర్జాపల్లి గ్రామానికి చెందిన ర్యాల సిద్దిరాములుగా గుర్తించారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ దవాఖానకి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.