చేర్యాల, మార్చి 7: దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ ఒగ్గు పూజారులు కలిసి తమ సమస్యలను విన్నించారు. తమకు ఆరోగ్యభద్రత కల్పించాలని, వృత్తిపరమైన కార్యక్రమాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు. వాటిని పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. వారి సమస్యలు తెలుసుకున్న మంత్రి కొండా సురేఖ స్పందించి ఆలయ ఈవో బాలాజీతో ఫోన్లో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.
ఒగ్గు పూజారులకు హెల్త్‌కార్డులు అందజేసేందుకు కృషిచేస్తామని, సమస్యల పరిష్కారానికి అన్ని విధాలుగా సహకరిస్తానని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో ఒగ్గు పూజారుల సంఘం అధ్యక్షుడు బొద్దుల కనకయ్య, ఉపాధ్యక్షుడు మక్కపల్లి మల్లేశం, కార్యదర్శి ఎక్కలదేవి రాములు, సహాయ కార్యదర్శి జింకల పర్వతాలు, చంద్రం, ఐలయ్య తదితరులు ఉన్నారు.