Collector Rahul Raj | కొల్చారం, మే 18 : వైద్యులు అందుబాటులో ఉండి ప్రజలకు వైద్య సేవలు అందించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. ఇవాళ మండల కేంద్రమైన కొల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని వార్డులు, ప్రసూతి విభాగం, మందుల స్టాక్ వంటివి పరిశీలించారు. ఓపీ రిజిస్టర్, సిబ్బంది హాజరు పట్టీ తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులలోని వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్ఈఓ మదన్మోహన్, సిబ్బంది గౌరి ప్రియాంక, ప్రవీణ తదితరులు పాల్గొన్నారు.
Mirchowk | మీర్‌చౌక్ అగ్నిప్రమాదం ఎలా జరిగిందంటే?.. వివరించిన అధికారులు
Unwanted Hair | అవాంఛిత రోమాలతో బాధపడుతున్న మహిళలు.. ఈ చిట్కాలను పాటించాలి..!
Javed Akhtar | నరకానికి అయిన వెళ్తాను కానీ పాకిస్తాన్‌కు వెళ్లను : జావేద్ అక్తర్