Panchayat Secretaries | మెదక్ మండలంలో ప్రత్యేకాధికారుల పాలనలో పారిశుధ్యం అధ్వానంగా తయారైంది. గ్రామాల్లో సర్పంచుల పదవీ కాలం ముగిసినప్పటి నుంచి గ్రామాలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. గ్రామాల్లో ఎక్కడ చూసినా చెత్తాచెదారం పేరుకుపోయింది. పంచాయతీల్లో నిధులు లేకపోవడంతో ప్రత్యేకాధికారులు, కొంతమంది పంచాయతీ కార్యదర్శులు నామ మాత్రంగా పని చేస్తున్నారు.
ముఖ్యంగా ఎండాకాలం రావడంతో పాతూరు, పేరూర్ గ్రామాల్లో మోటర్లు మరమ్మతులు చేయకపోవడం, మిషన్ భగీరథ రాకపోవడంతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో ప్రత్యేకాధికారులు ప్రజలకు అందుబాటులో ఉండకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
కొంతమంది పంచాయతీ కార్యదర్శులు గ్రామాలకు ఎప్పుడు వస్తారో.. ఎప్పుడు వెళతారో తెలియదు. వారికి సమయ పాలన లేదు. గ్రామాల్లో సమస్యలు ఉన్నాయని ఎవరికి చెప్పాలో తెలియడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Caste census funds | కుల గణన నిధులు విడుదల చేయాలని కలెక్టర్కు లేఖ
Gas Leak | ట్యాంకర్ నుంచి నైట్రోజన్ గ్యాస్ లీక్.. ఫ్యాక్టరీ ఓనర్ మృతి.. 40 మంది ఆస్పత్రిపాలు..!
Firecracker Factory | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. ముగ్గురు మృతి