Farmers | నర్సాపూర్, నవంబర్ 10 : నర్సాపూర్ మండల పరిధిలోని ఆవంచ గ్రామంలో ఏర్పాటు చేసిన పీఏసీఎస్ కొనుగోలు కేంద్రానికి రైతులు వరి ధాన్యం తీసుకువచ్చి నెల గడుస్తున్న ఇప్పటి వరకు మ్యాచర్ మిషన్ కూడా దిక్కులేదని తెలంగాణ రైతు రక్షణ సమితి మెదక్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ మండిపడ్డారు. చంద్రశేఖర్ సోమవారం ఆవంచలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ.. రైతులు ఆరబోసిన ధాన్యం ఎండిపోయి మూడు రోజులు అవుతున్నా కాంట పెట్టే నాధుడే లేడని వాపోయారు. వరి ధాన్యం ఎండకు ఎండి మ్యాచర్ 16 నుండి 17 వచ్చేలా ఉందని వాపోయారు. కేంద్రంలో కాంట ఉండగానే సరిపోతుందా..? మ్యాచర్ మిషన్ లేకుండా వరి ధాన్యాన్ని ఎలా తూకం వేస్తారోనని ప్రశ్నించారు. తూకం మిషన్ కూడా ఈరోజు కేంద్రానికి పంపిణీ చేశారని, ఇంత నిర్లక్ష్యం ఏంటని ప్రశ్నించారు. తెచ్చిన ధాన్యం తూకం వేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మండిపడ్డారు.
ఈ విషయంపై ఆర్డీవోతో మాట్లాడగా కేంద్రానికి కావాలసిన సదుపాయాలను పీఏసీఎస్ అధికారులతో మాట్లాడి ఏర్పాటు చేయిస్తానని హామీ ఇవ్వడం జరిగిందని వెల్లడించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మ్యాచర్ మిషన్ తక్షణమే పంపించాలని డిమాండ్ చేశారు. అలాగే తూకం వేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించడానికి ట్రాక్టర్ లేదా లారీని అందుబాటులో ఉంచాలని పీఏసీఎస్ చైర్మన్ రాజు యాదవ్‌ను కోరారు. ఇప్పటికైనా కేంద్రంలో అన్ని సదుపాయాలు కల్పించి కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని అన్నారు.
Collector Koya Sriharsha | ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు.. పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష