Livestock Shed | చిలిపిచెడ్, జూలై 17 : పాడి రంగానికి ప్రాధాన్యమిచ్చి రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధిహామీ పథకంలో పశువుల పాక నిర్మాణానికి అవకాశం కల్పించాయి. ఈ పథకం పాడి రైతులకు ఎంతో దోహదపడుతున్నా.. పాకల నిర్మాణం పూర్తయి నెలలు గడుస్తున్నా.. ఇంకా రైతులకు బిల్లు చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. ఉపాధిహామీ పథకంలో పశువుల షెడ్ల నిర్మాణానికి చిన్న, సన్న కారు రైతులకు ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసింది. పశువుల పాక సామర్థ్యాన్ని బట్టి ఒక్కో యూనిట్‌కు రూ.80 వేల వరకు బిల్లు రావాల్సి ఉండగా.. ఆరు నెలలు గడుస్తున్నా ఇంత వరకు బిల్లు రావడం లేదు.
అప్పు తెచ్చి నిర్మించుకుంటే..
చిలిపిచెడ్ మండలం చిట్కుల్‌కు చెందిన పాడి రైతు ప్రకాశ్‌కి ఉపాధిహామీ పథకం ద్వారా పశువుల షెడ్లు మంజూరయ్యాయి. మార్చి నెలలో రూ.93,297 నిధులతో నిర్మించుకున్నారు. ఉపాధి హామీ సిబ్బంది కొలతలు తీసుకున్నారు. కానీ ఇంత వరకు బిల్లు మాత్రం రాలేదు. కనీసం కూలీ చేసిన డబ్బులు కూడా అందలేదు. అప్పు తెచ్చి నిర్మించుకుంటే ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదని పాడి రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలా చిట్కుల్ గ్రామానికి చెందిన ప్రకాశ్ పశువుల పాకను నిర్మించుకుని ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయంపై మండల ఏపీవో శ్యామ్‌కుమార్‌ను వివరణ కోరాగా..ఉపాధి హామీ పథకం పశువుల షెడ్లకు సంబంధించి నిధుల విడుదలలో కొంత జాప్యంతో బిల్లులు చెల్లింపు జరగడం లేదన్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు తెలియజేశాం. త్వరలోనే బిల్లు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.
Siddipeta | రైతుల గోస రేవంత్ రెడ్డికి వినబడట్లేదా..? : జీడిపల్లి రాంరెడ్డి
Oil Palm | ఆయిల్ పామ్ తోటల సాగుతో అధిక లాభాలు..
Medak | కల్లు.. కల్లు.. కల్లమ్మ కల్లు.. కొత్త పుంతలు తొక్కుతున్న కల్తీకల్లు వ్యాపారం