e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 19, 2021
Home జిల్లాలు Narsapur|అరకిలో గంజాయి పట్టివేత

Narsapur|అరకిలో గంజాయి పట్టివేత


నిందితుడిని అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్​‍మెంట్‌ అధికారులు


నర్సాపూర్‌, సెప్టెంబర్‌13 : అక్రమంగా తరలిస్తున్న అరకిలో గంజాయిని ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్​‍మెంట్‌ అధికారులు పట్టుకున్న ఘటన తూప్రాన్‌ మండల కేంద్రంలో సోమవారం జరిగింది. మెదక్‌ ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్​‍మెంట్‌ సీఐలు మోహన్‌కుమార్‌, రమేశ్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు ద్విచక్రవాహనంపై అక్రమంగా ఎండుగంజాయిని తరలిస్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు సోమవారం తూప్రాన్‌ పట్టణంలో ఎన్‌ఫోర్స్​‍మెంట్‌ మెదక్‌ టీమ్‌ వాహనాల తనిఖీ నిర్వహించగా మాసాయిపేట్‌ మండల కేంద్రానికి చెందిన మంగళి రమేశ్‌ (22) ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఆపి తనిఖీ చేయగా 500 గ్రాముల ఎండుగంజాయి దొరికింది.

- Advertisement -

దీంతో అతడిపై గంజాయి అక్రమ రవాణా కేసు నమోదు చేసి తదుపరి విచారణ నిమిత్తమై ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ స్టేషన్‌ నర్సాపూర్‌కు తరలించి, 500 గ్రాముల ఎండుగంజాయి, బైక్‌, రెండు మొబైల్స్​‍ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ. 10 వేలు ఉంటుందని సీఐలు మోహన్‌కుమార్‌, రమేశ్‌రెడ్డి తెలిపారు. ఈ తనిఖీల్లో ఎన్‌ఫోర్స్​‍మెంట్‌ ఎస్ఐ రాజు, హెడ్‌కానిస్టేబుల్‌ ఆజామ్‌స్సేన్‌, సిబ్బంది గోపాల్‌, అనిల్‌, ముల్కయ్య, సతీష్‌, కరీమ్‌ పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana