ఇచ్చిన మాటను నిలబెట్టుకోని కాంగ్రెస్
కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ప్రకటించిన హామీలు అమలు చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి కోరారు. ఆదివారం మండలంలోని రాయిలాపూర్, జాజీ తండాల్లో నిర్మించిన పంచాయతీ భవనాలను మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు.
- రైతు రుణమాఫీ జాడలేదు.. 500 బోనస్ ఊసే లేదు.
- సర్పంచులు గర్వించేలా అభివృద్ధి పనులు
- బీఆర్ఎస్ హయాంలోనే గ్రామాల అభివృద్ధి
- నూతన పంచాయతీ భవనాల ప్రారంభోత్సవంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి
కౌడిపల్లి, జనవరి 28: కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ప్రకటించిన హామీలు అమలు చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి కోరారు. ఆదివారం మండలంలోని రాయిలాపూర్, జాజీ తండాల్లో నిర్మించిన పంచాయతీ భవనాలను మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పదేండ్లలో సర్పంచులు గౌరవంగా, గర్వంగా, తలెత్తుకునేలా అభివృద్ధి పనులు చేశారన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే పల్లెల్లో అభివృద్ధి జరిగిందన్నారు. కౌడిపల్లి మండలంలో కొత్తగా ఏర్పడ్డ అన్ని పంచాయతీలకు భవనాలు నిర్మించుకున్నట్లు తెలిపారు. మండలంలో రూ.13.88 కోట్ల రీబీటింగ్ పనులకు మూడు పనులు పూర్తి చేసుకుని, ఏడు ప్రగతిలో ఉన్నాయన్నారు. డిసెంబర్ 9న రెండు లక్షల రైతు రుణమాఫీ ఏమైందని, 50 రోజులకు పైగా కాలం గడుస్తున్నా రైతు భరోసా, రైతులకు బోనస్ ఇవ్వలేదని, ప్రభుత్వం దాటవేస్తున్నదని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ హయాంలో నర్సాపూర్ నియోజకవర్గానికి రూ.250 కోట్లకు పైగా వివిధ అభివృద్ధి పనులు మంజూరు చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని రద్దు చేస్తున్నదన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా కోఆప్షన్ సభ్యుడు మన్సూర్, ఎంపీపీ రాజు నాయక్, జడ్పీటీసీ సభ్యురాలు కవిత అమర్‌సింగ్, రాయిలాపూర్ ఉప సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్ కుర్మ శేఖులు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సార రామాగౌడ్, ఎంపీటీసీ సారా స్వప్నా కిశోర్‌గౌడ్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు గుంజరి ప్రవీణ్‌కుమార్, పీఆర్ డిప్యూటీ ఈఈ అమరేశ్వర్, ఏఈ ప్రభాకర్, సర్పంచులు రమేశ్‌నాయక్, ఎల్లం, లావణ్యామోహన్, పద్మాకిష్టయ్య, చంద్రశేఖర్‌గుప్తా, సంజీవ్, తునికి, ఆలయ కమిటీ డైరెక్టర్లు అంజాగౌడ్, దొంతుల దుర్గయ్య, సంతోష్, పీఏసీఎస్ డైరెక్టర్లు రాయగిరి, మల్లేశం, నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
సింగిల్ ఫేజ్ మోటర్ ప్రారంభం
నర్సాపూర్, జనవరి 28 : మున్సిపల్లోని 6వ వార్డులో నీటి సమస్యను తీర్చడానికి మదర్సా భవనం వద్ద సింగిల్ ఫేజ్ మో టర్ను ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆదివారం ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఇన్చార్జి చైర్మన్ నయీమొద్దీన్, నాయకులు లాయక్ ఆలీఖాన్, సత్యంగౌడ్, ముజాహిద్ఖాన్ పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

