హత్నూర, డిసెంబర్ 9: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలే బీఆర్ఎస్ అభ్యర్థుల విజయాలుగా మారనున్నాయని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం హత్నూ ర, కొడిపాక, బ్రాహ్మణగూడ, నాగుల్దేవులపల్లి గ్రామాల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులకు మద్దతుగా ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంలో ఏ గ్రామానికి వెళ్లినా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులే కనబడుతున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేండ్లు గడుస్తున్నా, ఏఒక్క పథకాన్ని సక్రమంగా అమలు చేయలేక పోయిందని విమర్శించారు. నేడు రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. సంక్షే మ పథకాలు అమలు కావడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను ప్రజలు గుర్తిస్తున్నారని, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని ప్రజలకు సునీతాలక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి, మాజీ ఎంపీపీ నర్సింహులు, రవికుమార్, బాబుయాదవ్, కిశోర్, సాజిద్, ఇబ్రహీం, వీరేందర్ పాల్గొన్నారు.