Collector Rahulraj | మెదక్ రూరల్ సెప్టెంబర్ 09 : స్థానిక సంస్థల ఎన్నికలకు నేటినుండి జిల్లా వ్యాప్తంగా నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో గురువారం జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారిరాహుల్ రాజ్ హవేలీ ఘనపూర్ మండలం కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ ప్రక్రియను పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నామినేషన్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా నామినేషన్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నోటిఫికేషన్ ప్రక్రియలో భాగంగా నోటీస్ ప్రదర్శించిన విధానాన్ని అలాగే హెల్ప్ డెస్క్‌లో విధులు నిర్వర్తిస్తున్న అధికారులకు వారి విధుల పట్ల ఉన్న అవగాహనను కలెక్టర్ పరిశీలించారు.
ప్రతి నామినేషన్ సెంటర్ వద్ద హెల్ప్ డెస్క్
నామినేషన్ స్వీకరణ సమయంలో ఆర్వో, ఏఆర్వో ఏమేమి చెక్ చేయాలో క్షుణ్ణంగా కలెక్టర్ వివరించారు. మూడు రోజులపాటు నామినేషన్లు స్వీకరిస్తామని చెప్పారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతి నామినేషన్ సెంటర్ వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని అభ్యర్థులకు ఏమైనా సలహాలు, సందేహాలు ఉంటే అక్కడ సంప్రదించాలని సూచించారు.
నామినేషన్ ప్రక్రియ జరిగే ఈ మూడు రోజులు ఉదయం 10.30 గంటల నుండి నుండి సాయంత్రం 5 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా మెదక్ జిల్లాలో మొదటి దశలో మెదక్ రెవెన్యూ డివిజన్ పరిధిలో 10 మండలాల్లో ఎంపిటిసి , జడ్పీటీసీ లకు నామినేషన్ ల ప్రక్రియ ప్రారంభం అయ్యిందన్నారు.
మెదక్ జిల్లాలో 523,327 మంది ఓటర్లు ఉండగా.. అందులో 251,532 పురుషులు, 271,787 మహిళ ఓటర్లు ఉన్నారు..
జిల్లాలోమొత్తం 21 జడ్పీటీసీ, 190 ఎంపీటీసీ స్థానాలు ఉండగా… మొదటి దశలో మెదక్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 10 మండలాలలో మెదక్, హవేలీ ఘనపూర్ ,రామాయంపేట, నిజాంపేట్, పాపన్నపేట, టేక్మల్ ,అల్లదుర్గం, పెద్ద శంకరం పేట,చిన్న శంకరం పేట 10 జెడ్పీటీసీ స్థానాలు, 99 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ ల ప్రక్రియ మొదలు అయ్యిందనీ తెలిపారు.
ప్రతి ఒక్కరూ స్థానిక సంస్థల ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకొని రాష్ట్రంలో మెదక్ జిల్లాను ఉన్నత స్థానంలో ఉంచాలని ఏలాంటి ప్రలోభాలకు లొగ్గకుండా ఉండాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
Read Also :
Local Body Elections | స్థానిక ఎన్నికల నామినేషన్లు షురూ.. కీలక ప్రకటన చేసిన ఎస్ఈసీ
KCR | బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు పితృ వియోగం.. సంతాపం తెలిపిన కేసీఆర్