హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ) : ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎప్‌సెట్ సిలబస్ 2028లో మారనున్నది. ఇంటర్ సిలబస్ మారనుండగా, ఆయా సిలబస్ ఆధారంగా ఎప్‌సెట్ సిలబస్‌ను సైతం మార్చనున్నారు. 2026-27లో ఇంటర్ ఫస్టియర్ సిలబస్ మారనున్నది. 2027-28లో సెకండియర్ సిలబస్‌ను మార్చనున్నారు. ఈ నేపథ్యంలో 2028లో ఎప్‌సెట్ సిలబస్ మారుతుందని ఎప్‌సెట్ -26 కన్వీనర్ ప్రొఫెసర్ కే విజయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఇంటర్ సిలబస్‌ను గరిష్ఠంగా 30% మార్చేందుకు ఇంటర్‌బోర్డు ఇప్పటికే రంగం సిద్ధం చేసింది. మారిన సిలబస్ ఎప్‌సెట్ పరీక్షలోనూ ఉంటుంది.