VOAs | చిలిపిచెడ్, అక్టోబర్ 9: చిలిపిచెడ్ మండల కేంద్రమైన సమైక్య కార్యాలయంలో వీవోఏల సమావేశం నిర్వహించినట్టు మండల ఐకెపి ఏపీఎం గౌరీ శంకర్ తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మెదక్ జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాస రావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చిలిపిచెడ్ మండలంలో ఉన్న మహిళా సంఘాలకి అవసరానికి అనుగుణంగా రావాల్సిన రుణాలను బ్యాంకు ద్వారా ఇప్పించడంలో ఎదుర్కొంటున్న సమస్యలపై కూలంకషంగా చర్చించడం జరిగింది. వాటికి శాశ్వత సమస్య దిశగా పరిష్కారం నిర్దేశించడం జరిగింది. గ్రామం వారీగా వివోఏ లను సంఘం వారీగా రుణ వితరణ గురించి సమీక్షించామన్నారు.
అంతేకాకుండా చిలిపిచెడ్ మండలంలోని 387 సంఘాల్లో ఉన్న 4045 మంది సభ్యురాలు తమ ఇంటి వద్ద లేదా పొలం వద్ద ఒక బహువార్షిక మొక్కని పెంచి మూడు సంవత్సరాలు పోషణ చేసి సమాజానికి అంకితం ఇవ్వాలనీ, నా మొక్క నా బాధ్యత అనే కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని వీవోఏలకు మార్గం నిర్దేశకం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారితోపాటు ఏపీఎం గౌరిశంకర్, సీసీలు పురుషోత్తం, వెంకటలక్ష్మి, శ్రీకాంత్, విజయలక్ష్మి, లక్ష్మణ్, అకౌంటెంట్ మానస, వివోఏలు సరిత, రేణుక, వీరమని, మాధవి, రమణి, మహేశ్వరి, మంగ, మంజుల, బాగయ్య పాల్గొన్నారు.
Local Body Elections | స్థానిక ఎన్నికల నామినేషన్లు షురూ.. కీలక ప్రకటన చేసిన ఎస్ఈసీ
KCR | బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు పితృ వియోగం.. సంతాపం తెలిపిన కేసీఆర్