MLA Sunitha Lakshma Reddy | కొల్చారం, మార్చి 27 : ఘణపూర్ ప్రాజెక్టు నీటి మట్టం పెంచేందుకు చేపట్టిన పనుల్లో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం విడుదల చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మా రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయంపై ఇవాళ సునీతా లక్ష్మా రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ.. మండల పరిధిలోని చిన్న ఘణపూర్ శివారు ప్రాంతంలోని చిన్న నీటిపారుదల ప్రాజెక్టు అయిన ఘణపూర్ ఆయకట్టు సామర్థ్యాన్ని 0.3 టీఏంసీలకు పెంచడానికి పనులు ప్రారంభించారని తెలిపారు.
ఘణపూర్ ప్రాజెక్టుకు సంబంధించి ముంపు ప్రాంతాల రైతుల నుండి 800 వందల ఎకరాల భూమిని సేకరించారన్నారు. వీరికి రూ.7 కోట్లు పరిహారం ఇవ్వాల్సి ఉండగా.. ఇప్పటి వరకు విడుదల చేయలేదన్నారు. బాధిత రైతులు ఇటు భూములు సాగు చేసుకోలేక, అటు పరిహారం రాక ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు.
TG Weather | తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు.. మూడు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్..
KTR | అవయవ దానానికి సిద్ధం.. అసెంబ్లీ వేదికగా ప్రకటించిన కేటీఆర్
మళ్లీ రోడ్లపైకి నీటి ట్యాంకర్లు.. జోరుగా నీటి దందా..!