Mobile Phones | పాపన్నపేట, జులై 26 : సెల్ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు వాటిని రికవరీ చేసి వారికి అప్పగించినట్లు పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. బాధితుల నుంచి ఫిర్యాదు రావడంతో వారికి సంబంధించిన ఏడు సెల్ ఫోన్లు రికవరీ చేసి శనివారం వారికి అప్పగించారు.
ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. సెల్ఫోన్లను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేశామన్నారు. ఇప్పటివరకు తాము 300 పైచిలుకు సెల్ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించామన్నారు. అయితే ఎవరైనా సెల్ ఫోన్లు పోగొట్టుకుంటే వెంటనే పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ సూచించారు. తాము పోగొట్టుకున్న సెల్ఫోన్లను ఎస్ఐ వెంటనే రికవరీ చేయడం పట్ల బాధితులు హర్షం వ్యక్తం చేశారు.
Gajwel | గజ్వేల్లో దొంగల హల్చల్.. తాళం వేసిన ఇండ్లలో చోరీలు
నడిరోడ్డుపై గుంతలు.. వాహనదారులకు పొంచి ఉన్న ప్రమాదం
Motkur : మోత్కూరు- రాజన్నగూడెం ప్రధాన రోడ్డుపై వరి నాట్లతో బీఆర్ఎస్ నిరసన