మంత్రి హరీశ్‌రావు ఎత్తుగడలతో చిత్తవుతున్న కాంగ్రెస్, బీజేపీసంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులవుతున్న నాయకులు, కార్యకర్తలు శుక్రవారం మంత్రి హరీశ్‌రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన జహీరాబాద్ ముస్లిం నాయకులు మూడో సారీ సీఎం కేసీఆర్‌ను గెలిపించుకోవాలని పిలుపు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం పల్లెల్లో మొదలైన ఎన్నికల సందడి బీఆర్ఎస్ ప్రభుత్వానికే మద్దతిస్తామంటున్న ప్రజలు నారాయణఖేడ్, జహీరాబాద్, అందోల్ ఎమ్మెల్యేలు ఆధ్వర్యంలో వందల మంది చేరిక.
సంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ జోరు పెంచింది. సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మంత్రి హరీశ్‌రావు చొరవతో కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున గులాబీ పార్టీలో చేరుతున్నారు. ముఖ్యంగా హస్తం పార్టీ నుంచి వలసలు పెరుగుతున్నాయి. శుక్రవారం జహీరాబాద్‌కు చెందిన కాంగ్రెస్ ముస్లిం నాయకులు హైదరాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. జహీరాబాద్, అందోల్ ఎమ్మెల్యేలు మాణిక్‌రావు, క్రాంతికిరణ్ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో చేరారు. నారాయణఖేడ్ మండలం పంచగామ, పోతన్‌పల్లి(ఎం), నాగల్గిద్ద మండలం కారాముంగికి చెందిన 700 మందికి ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసి మూడో సారీ బీఆర్ఎస్ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఇంటింటికీ వివరించాలని, అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
– సంగారెడ్డి (నమస్తే తెలంగాణ)/ నారాయణఖేడ్/ అందోల్/ జహీరాబాద్, ఆగస్టు 18
జహీరాబాద్, ఆగస్టు 18: ముస్లిం మైనార్టీల అభివృద్ధి, సంక్షేమానికి బీఆర్ఎస్ సర్కారు కృషి చేస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జహీరాబాద్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ముస్లిం నాయకులు మంత్రి హరీశ్‌రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ జహీరాబాద్ పట్టణంలోని ముస్లింల కోసం షాదీఖాన, హజ్ హౌస్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు గుర్తు చేశారు. విద్యార్థుల చదువుల కోసం మైనార్టీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి ఆంగ్ల బోధన చేపట్టినట్లు వివరించారు. ముస్లింలు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. కాంగ్రెస్ మైనార్టీ సెల్ జహీరాబాద్ పట్టణాధ్యక్షుడు మహమ్మద్ మోహిజ్, సీనియర్ నాయకులు అక్బర్, ఫక్రుద్దీన్తోపాటు 200 మంది ముస్లింలు బీఆర్ఎస్లో చేరగా, మంత్రి హరీశ్‌రావు వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీఎస్ఐడీసీ చైర్మన్ తన్వీర్, బీఆర్ఎస్ నాయకులు నరోత్తం, నామ రవికిరణ్, బాసిత్, సయ్యద్ మసూద్ హుస్సేన్, తాజోద్దీన్, అక్రమం తదితరులున్నారు.
కేసీఆర్ ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత ప్రజలదే : నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి
నారాయణఖేడ్, ఆగస్టు 18: అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి పాటుపడుతున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత ప్రజలదేనని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. నారాయణఖేడ్ మండలం పంచగామకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు, నాగల్గిద్ద మండలం కారాముంగికి చెందిన కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ఆయా పార్టీలను వీడి ఎమ్మెల్యే సమక్షంలో పెద్దఎత్తున బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఓవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తూ దేశంలోనే తెలంగాణ రాష్ర్టాన్ని అగ్రస్థానంలో నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఓట్ల కోసం ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలు, కుట్రలను తిప్పికొట్టే దిశగా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సమైక్య రాష్ట్రంలోని ఏ ప్రభుత్వం చేయని విధంగా నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని ఊహించని రీతిలో అభివృద్ధి చేసుకున్నామన్నారు.
సీఎం కేసీఆర్ పాలనకు ఆకర్షితులై ఇతర పార్టీల వారు స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. కాగా, నారాయణఖేడ్ మండలం పంచగామ చెందిన వార్డు సభ్యుడు గైని సాయిలు సహా కాంగ్రెస్ కార్యకర్తలు గైని విఠల్, దేవిదాస్, హన్మంతు, నర్సింహులు, కిష్టయ్య, మోసిన్, గోవింద్, శ్రీనివాస్, బాబా, రహీంపాషా, అశోక్, మోహన్, నాగయ్య, మాణికయ్య, శ్రీకాంత్‌రెడ్డి, బసప్ప, శరణయ్య, గాల్గొండలతోపాటు మొత్తం 30 కుటుంబాలకు చెందిన సుమారు 200 మంది, నాగల్గిద్ద మండలం కారాముంగికి చెందిన కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ఏశప్ప, శిరోమణి, డేవిడ్, ఏశప్ప, సంజీవ్, కంకు, శాంసన్, శాంతకుమార్, రోబిన్ సహా 46 కుటుంబాలకు చెందిన మొత్తం దాదాపు 300 మంది ఆయా పార్టీలను వీడి బీఆర్ఎస్లో చేరగా వారికి ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో నాగల్గిద్ద ఎంపీపీ ఉపాధ్యక్షుడు పండరియాదవ్, ఆయా గ్రామాల ఎంపీటీసీలు విఠల్, గడ్డే రమేశ్, నాయకులు ప్రహ్లాద్, సాయిలు, రాజు, దత్తు, కృష్ణ, జైపాల్, శంకర్, అమేర్, శంకర్‌రెడ్డి, వెంకట్, చంద్రశేఖర్, మనోహర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
పోతన్‌పల్లి(ఎం)లో 200 మంది..
నారాయణఖేడ్ మండలం పోతన్‌పల్లి(ఎం)లో కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 200 మంది శుక్రవారం ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వార్డు సభ్యుడు హన్మంతు సహా సంజీవులు, కిష్టయ్య, రవి, రాజు, రాజయ్య, ప్రవీణ్, సంజీవులు, అంజయ్య, సాయిలు, రవి, కిష్టయ్య తదితరులకు ఎమ్మెల్యే బీఆర్ఎస్ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో సర్పం చ్ స్వరూప, నాయకులు అంజాగౌడ్, నర్సింహులు, అశోక్‌రెడ్డి, రాములు, విజయ్, సత్యాగౌడ్, మల్లేశ్, సాయిలు, నాగయ్య, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.