MSP Maisa Ramulu | రాయపోల్, సెప్టెంబర్ 4 : నేడు దుబ్బాక నియోజకవర్గంలో జరిగే చేయూత పెన్షన్ దారుల సభను విజయవంతం చేయాలని ఎమ్మెస్పీ (మహాజన సోషలిస్టు పార్టీ) రాష్ట్ర నాయకుడు మైసరాములు మాదిగ అన్నారు. గురువారం సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండలంలోని అనాజీపూర్ గ్రామంలో అన్నిరకాల పెన్షన్ దారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుబ్బాకలో వికలాంగులు, చేయూత పెన్షన్ దారుల మహాసభ జరగనుందన్నారు.
వికలాంగుల పెన్షన్ రూ.6 వేలకూ, మిగతా చేయూత పెన్షన్లు రూ.4 వేలకూ పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభకు ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ పాల్గొంటారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలలో ఇచ్చిన మాట ప్రకారం వికలాంగులకు రూ.6 వేలు, పెన్షన్ దారులకు రూ.4 వేలు ఇస్తున్నారని, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలు అమలు చేయడం లేదని, పెన్షన్ దారులు మోసపోయారని విమర్శించారు.
నేడు దుబ్బాకలో జరిగే మహాసభకు చేయూత పెన్షన్ దారులు, వికలాంగులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు అయ్యగల్ల రవి, నాయకులు ఇస్తారి తదితరులు పాల్గొన్నారు.
GST | సిమెంట్, ఉక్కుపై జీఎస్టీ రేట్ల తగ్గింపు.. రియల్ ఎస్టేట్‌కు ప్రోత్సాహం..!
Laxmidevipally : ‘పంట ధ్వంసం చేసిన ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలి’
Nur Khan Base | భారత్ దాడిలో దెబ్బతిన్న నూర్ఖాన్బేస్లో పునర్నిర్మాణ పనులు చేపడుతున్న పాక్