Fertilizers | మెదక్ రూరల్, జూలై 23 : నకిలీ విత్తనాలను ఎవరైనా విక్రయిస్తే వారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మార్వో లక్ష్మణ్ బాబు , మెదక్ టౌన్ ఎస్ఐ అమర్ హెచ్చరించారు.
బుధవారం మెదక్ జిల్లా కేంద్రంలో మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, ఎస్ఐ అమర్ కలిసి ఫర్టిలైజర్ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. దుకాణాల్లో స్టాక్ రిజిస్ట్రర్లు, బిల్ బుక్కులను పరిశీలించారు. రైతులు ఎరువులు కొనుగోలు చేసిన సమయంలో విధిగా బిల్లులు ఇవ్వాలని, దుకాణాల ఎదుట ధరల పట్టిక ఏర్పాటు చేయాలని దుకాణాల నిర్వాహకులకు సూచించారు.
ప్రభుత్వ ఆమోదం పొందిన విత్తనాలు, ఎరువులే ఉన్నాయా..? విక్రయాలకు సంబంధించి రైతుల వివరాలు, వారి పేరు నమోదు చేస్తున్నారా.. లేదా..? అని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏఈవో రాజ శేఖర్, సీఈఓ సాయికుమార్ , కానిస్టేబుల్ రవి, సిబ్బంది ఉన్నారు.
Ganja Seized | ద్విచక్ర వాహనంపై గంజాయి తరలింపు.. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Vice president Elections | ఉపరాష్ట్రపతి ఎన్నికలకు కసరత్తు మొదలుపెట్టిన ఈసీ