రామచంద్రాపురం, సెప్టెంబర్ 30: ప్రతి ఒక్కరికి చదువు అందినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని మెదక్ ఎంపీ రఘునందన్‌రా వు అన్నారు. ఆర్సీపురం డివిజన్ శ్రీనివాస్నగర్కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ‘మనఊరు..మనబడి’ కార్యక్రమంలో భాగంగారూ.1.23 కోట్లతో నిర్మించిన నూత న పాఠశాల భవనాన్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, డివిజన్ కార్పొరేటర్ పుష్పానగేశ్‌తో కలిసి ఎంపీ రఘునందన్‌రావు ప్రారంభించారు.
అనంతరం విద్యార్థుల సాం స్కృతిక కార్యక్రమాలను వారు తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి భవిష్యత్తు తరగతి గదిలో నిర్మితమవుతుందన్న స్వామి వివేకానంద సూక్తికి అ నుగుణంగా ప్రతి విద్యార్థి భవిష్యత్తుని తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి మా ట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు. పటాన్చెరు నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా అభివృద్ధి చేశామన్నారు.
పాఠశాల నిర్మాణానికి జీవీఆర్ ఎంటర్ప్రైజెస్ సీఎస్ఆర్ నుంచి రూ.40లక్ష లు కేటాయించినట్లు తెలిపారు. కార్యక్రమం లో భారతీనగర్ కార్పొరేటర్ సింధూఆదర్శ్‌రెడ్డి, హెచ్ఎం ప్రతాప్‌రెడ్డి, బల్దియా ఉపకమిషనర్ సురేశ్, పంచాయతీరాజ్ డీఈ సురేశ్, ఎంఈవో పీపీరాథోడ్, అంజయ్య, కుమార్‌గౌడ్, పరమేశ్, గోవింద్, ఐలేశ్, నర్సింగ్, మల్లేశ్, సంతోష్, బలరాం పాల్గొన్నారు.