BRS Rajathotsava Sabha | మనోహరాబాద్ : వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేసేందుకు గులాబీ సైన్యం సన్నద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు, ప్రజలు భారీగా సభకు వచ్చేలా బీఆర్ఎస్ నేతలు ప్రచార కార్యక్రమాలతో బిజీబిజీగా ఉన్నారు.
వరంగల్లో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ యాదవ రెడ్డి కోరారు. ఇవాళ మనోహరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. రజతోత్సవ సభను విజయవంతం చేసేందుకు తరలిరావాలని ఎమ్మెల్సీ యాదవ రెడ్డితోపాటు ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, రాష్ట్ర నాయకుడు శేఖర్ గౌడ్ కోరారు.
సభను విజయవంతం చేసేందుకు ప్రతీ కార్యకర్త తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పురం నవనీత, రవి ముదిరాజ్, మాజీ ఎంపీటీసీ లతా వెంకట్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Prayag ManZhi | తనపై కోటి రూపాయల రివార్డ్ ఉన్న మావోయిస్టు మాంఝీ ఎన్కౌంటర్లో మృతి
Road Accident | నెలాఖరులో పదవీ విరమణ..అంతలోనే రోడ్డుప్రమాదం.. ఘటనలో హెడ్మాస్టర్ దుర్మరణం