మెదక్, నవంబర్ 2(నమస్తే తెలంగాణ): ప్రతిపక్షాలను తిట్టడంతో ఉన్న శ్రద్ధ సీఎం రేవంత్, మంత్రులకు ధాన్యం కొనుగోలులో లేదని ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి అన్నారు. శనివారం మెదక్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో జర్నలిస్టులతో ఆయన చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో రైతులకు ఎలాం టి ఇబ్బంది లేకుండా కేసీఆర్ ధాన్యం కొన్నట్లు గుర్తుచేశారు. కరోనా లాంటి కష్ట సమయంలోనూ గ్రామాల్లో కేం ద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం తూకం వేశారన్నారు. 72 గంటల్లో రైతుల అ కౌంట్‌లో నగదు జమ చేశామని గుర్తు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కొబ్బరికాయలు కొట్టి కొనుగోలు కేం ద్రాలు ప్రారంభించడం కాదని, ధాన్యాన్ని తూకం వేసి అకాల వర్షాల నుంచి రైతులను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. ధాన్యాన్ని కోసి నెల రోజులు గడుస్తున్నా తూకం వేయకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయించి తక్కువ ధరకే ధాన్యాన్ని అమ్ముకుంటూ నష్టపోతున్నారన్నారు. వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని, హైడ్రా,మూసీ సుందరీకరణ అంటూ హడావిడి చేయడం తప్పా ప్రజలకు చేసిన మేలు ఏమి లేదని శేరి సుభాశ్‌రెడ్డి విమర్శించారు.
పౌరసరఫరాల శాఖ, రైస్ మిల్లర్స్‌కు మధ్య సమన్వయం లేక కేంద్రాల్లో ధాన్యం తూకంలో జాప్యం జరుగుతోందన్నారు. యాసంగి పంట వేయాలా వద్దా అనే అయోమయ స్థితిలో రైతులు ఉన్నారని తెలిపారు. రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుకే లక్ష కోట్ల రూపాయలు దాటలేదు, కానీ.. మూసీ సుందరీకరణకు లక్షా యాభై వేల కోట్లతో చేయడంలో ఆంతర్యమేమిటో ప్రభుత్వం చెప్పాలన్నారు. బీఆర్ఎస్ ప్రభు త్వం మంజూరు చేసిన కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఇస్తున్నారని ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వానికి నిర్ధిష్టమైన ప్రణాళిక లేక తెలంగాణను ఆగం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుభరోసా, పంట రుణమాఫీ పూర్తిస్థాయి లో చేయాలని ఆయన డిమాండ్ చేశారు.