మెదక్ అర్బన్,డిసెంబర్ 25 : మెదక్ చర్చికి వందేండ్ల చరిత్ర ఉందని, ఉపాధి కల్పించడానికి చర్చి నిర్మాణం చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం క్రిస్మ స్ సందర్భంగా ఆమె మెదక్ చర్చిని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మెదక్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయం లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ..మెదక్ ప్రాంతం జిల్లా కావాలనే కల ఉండేదని, అది కేవలం తెలంగాణ ఏర్పాటు తర్వాతనే కేసీఆర్ జిల్లాను ఏర్పాటు చేశారన్నారు. జిల్లా ఏర్పాటు తర్వాతే అన్ని హంగులు మెదక్‌కు వచ్చాయని, ప్రత్యేకంగా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, మెడికల్ కళాశాల వచ్చిందన్నా రు. మెదక్ అంటేనే ఒక పక్క ఏడుపాయల దుర్గమ్మ, ఒక పక్క చర్చి, మరో పక్క మంజీరా ఉందన్నారు. ఇక్కడ ఉండే పంటలు అద్భుతంగా ఉండేవని ఆనాడు శ్రీనాథుడు చెప్పాడని పదే పదే కేసీఆర్ చెబుతుండేవాడన్నారు. సింగూరు నుంచి హైదరాబాద్‌కు నీళ్లు తీసుకువెళ్తుంటే ఘనపురం ఆయకట్ట రైతులకు నీళ్లు రాని పరిస్థితి ఉండేదన్నారు. తెలంగా ణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ పట్టుబట్టి గోదావరి జలాలతో సింగూరు నింపి తద్వారా ఘనపురం ఆయకట్టును పరిరక్షించారన్నారు. మెదక్ జిల్లాలోని చెరువుల్లో పూడికలు తీసి 365 రోజులు చెరువుల్లో నీళ్లు ఉండాలని కేసీఆర్‌కు కల ఉండేదన్నారు.
దాని కోసమే కాళేశ్వరం నుంచి ఇక్కడికి నీళ్లు తెచ్చుకోవాలని అనుకున్నాం కానీ ఆ పనులు ప్రస్తుత ప్రభుత్వం సగంలోనే ఆపడం దారుణమన్నారు. కాం గ్రెస్ పాలనలో క్రిస్మస్ గిప్ట్, రంజాన్ తోఫా, బతుకమ్మ చీరల పంపిణీ ఆగిపోయిందని విమర్శించారు. మెదక్ చర్చిని సందర్శించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మహిళలకు నెలకు రూ.2500, యువతులకు కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామనే ప్రకటన చేస్తారని ఆశించినా ఫలి తం లేదన్నారు. 18 ఏండ్లు నిండిన ఆడపిల్లలకు తక్షణమే స్కూటీలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రభుత్వం నిలిపివేయడం దారుణమన్నారు. కాంగ్రెస్ ప్రభు త్వం రైతు బంధును ఎగ్గొట్టిందని మండిపడ్డారు.నిబంధనల పేరుతో రైతు భరోసా ఎగ్గొడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ధాన్యానికి బోనస్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు కేవలం సన్నవడ్లకే పరిమితం చేసిందని, అది కూడా సరిగ్గా ఇవ్వడం లేదన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీలు శేరి సుభాష్‌రెడ్డి, యాదవరెడ్డి, మాజీ ఎమ్మె ల్యే శశిధర్‌రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు భిక్షపతి, మేడే రాజీవ్‌సాగర్, జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు లావణ్యారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మ న్ మల్లికార్జున్‌గౌడ్, కృష్ణారెడ్డి, జయరాజ్, ఆర్కే శ్రీనివాస్, కిశోర్, అంజగౌడ్, లింగారెడ్డి, కృష్ణ గౌడ్, జుబేర్, నాయకులు పాల్గొన్నారు.