గజ్వేల్, ఆగస్టు 9:ప్రతి ఇంటి ఆవరణంలో మొక్క లు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీలో స్వచ్ఛదనం-పచ్చదనంలో భాగంగా మొక్కలు నాటిన సందర్భంగా ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హ యాంలో ప్రతియేడు కోట్లాది మొక్కలు నాటామని, కేసీఆర్ మంచి లక్ష్యంతో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో నేడు తెలంగాణ పచ్చదనంలో కనిపిస్తున్నదన్నారు.
ఇప్పుడు మనం నాటే మొక్కలు రాబోయే తరాలకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ప్రతిఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ను తీసుకోవాలన్నారు. గజ్వేల్ వ్యవసాయ మార్కె ట్ యార్డు ఆవరణంలో సిబ్బందితో కలిసి మార్కె ట్ కార్యదర్శి జాన్‌వెస్లీ, సూపర్వైజర్ మహిపాల్ మొక్కలు నాటారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎన్సీ.రాజమౌళి, కమిషనర్ గోల్కొండ నర్సయ్య, కౌన్సిలర్లు గోపాల్‌రెడ్డి, శ్యామలా మల్లే శం, అధికారులు పాల్గొన్నారు.