గజ్వేల్, నవంబర్ 4: కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మద్దతు ధర చెల్లించాలని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి కోరారు. సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని పిడిచేడ్ సమీపంలో సీసీఐ, జాలిగామలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆలస్యంగా సీసీఐ కొనుగోలు కేం ద్రాలు ప్రారంభించడంతో రైతులు ఇప్పటికే తీవ్రంగా నష్టపోయారన్నారు. రైతులకు అన్ని సదుపాయాలు కల్పించి త్వరగా కొనుగోలు చేపట్టాలన్నారు.
ఇప్పటికైనా సీసీఐ కొనుగోలు కేం ద్రాల్లో కేంద్రం నిర్ణయించిన మద్దతు ధర చెల్లించి రైతులకు న్యాయం చేయాలని అధికారులకు సూ చించారు. తేమశాతం పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా పత్తి కొనుగోలు చేసే విధంగా అధికారులు చూడాలన్నారు. గ్రామాల్లో దళారులు కొనుగోలు చేపట్టకుండా మార్కెటింగ్ అధికారులు తనిఖీలు చేపడుతూ రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ధాన్యాన్ని కూడా త్వర గా కొనుగోలు చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, ఏఎంసీ చైర్మన్ నరేందర్రెడ్డి, కార్యదర్శి జాన్వెస్లీ, వైస్ చైర్మన్ సర్దార్ఖాన్ పాల్గొన్నారు.