సిద్దిపేట, నవంబర్ 30: వైకుంఠధామాలను అద్భుతంగా తీర్చిదిద్దామని, అంతిమ సంస్కారాలు ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగేలా సిద్దిపేటలోని వైకుంఠధామాలను అభివృద్ధి చేశామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. శనివారం సిద్దిపేట బైపాస్ రోడ్డు ప్రశాంత్ నగర్ పరిధిలోని వైకుంఠధామాన్ని సందర్శించి మార్నింగ్ వాక్ చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సిద్దిపేట వైకుంఠధామాన్ని రూ. 2 కోట్లతో అభివృద్ధి చేశామన్నాన్నారు.
దుర్వాసన, అపరిశుభ్రతతో ఉన్న శ్మశాన వాటికలను సంసారవంతంగా తీర్చిదిద్దామన్నారు. ఇది వైకుంఠధామం కాదు.. ఒక పార్ మాదిరిగా తయారు చేసుకున్నామని చెప్పారు. రోజూ మార్నింగ్ వాక్, యోగా, సమావేశాలు జరుపుకునేందుకు వీలుగా అభివృద్ధి చేసుకున్నట్లు చెప్పారు. అంతిమ సంసారానికి వచ్చేవారు బాధను మరిచిపోయే విధంగా ఒక ఆహ్లాద భరిత వాతావరణం ఉండేలా వైకుంఠధామం ఉన్నదన్నారు. నిర్వహణ చాలా బాగుందని సంతృప్తి వ్యక్తం చేశారు.
వారికి కొన్ని సూచనలు చేశారు. ప్రజలకు అవసరమయ్యే విధంగా అన్ని వసతులు ఉండేలా చూడాలని చెప్పారు. వైకుంఠధామం కమిటీ అధ్యక్షుడిని, సభ్యులను అభినందిస్తూ శాలువాతో సతరించారు. స్వచ్ఛందంగా మీరు చేస్తున్న సేవ ఎంతో పుణ్యమని, మీకు సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు. ఎమ్మెల్యే హరీశ్‌రావు వెంట మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్‌రెడ్డి, పాల సాయిరాం, కౌన్సిలర్లు విఠోభా, ఆరవింద్‌రెడ్డి, నాయకులు శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు రజనీకాంత్‌రెడ్డి, పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, నాయకులు తదితరులు ఉన్నారు.