నర్సాపూర్, జనవరి 31: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి శుక్రవారం ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో మర్యాదపూర్వకం గా కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డిని ఆప్యాయంగా పలుకరించి నర్సాపూర్ నియోజకవర్గ పరిస్థితులపై ఆరాతీశారు.
నర్సాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలను ఓసారి కలవాలని కేసీఆర్‌కు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి విజ్ఞప్తి చేయగా, ఫిబ్రవరిలో కలుస్తానని చెప్పారు. వీరితో పాటు గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రాగౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సత్యంగౌడ్ ఉన్నారు.