కొల్చారం, ఆగస్టు 9: ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలోని సాంఘి, సంక్షేమ గురుకుల పాఠశాలను శుక్రవారం ఆమె సందర్శించారు. స్వచ్ఛదనం-పచ్చదనంలో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆమె పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు.
అనంతరం శ్రావణ శుక్రవారం, నాగుల పంచమి సందర్భంగా మండలంలోని రంగంపేటలోని మాధవానంద సరస్వతీ ఆశ్రమ పీఠాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. పీఠాధిపతి మాధవానంద సరస్వతీ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ నాయకులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి రాధాకిషన్, తహసీల్దార్ గఫార్‌మియా, ఎంపీడీవో కృష్ణవేణి, ఏపీ వో మహిపాల్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి అం జయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గౌరీశంకర్గుప్తా,
యువత విభాగం అధ్యక్షుడు సంతోష్‌రావు, మాజీ ఎంపీపీ మంజులాకాశీనాథ్, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు ముత్యంగారి సంతోష్‌కుమార్, శ్రీనివాస్‌రెడ్డి, కరెంట్ రాజాగౌడ్, యాదాగౌడ్, ఇంద్రసేనారెడ్డి, నరేందర్‌రెడ్డి, చిట్యాల యాదయ్య, గౌరీశంకర్, ముత్యం ప్రవీణ్‌కుమార్, చెన్నయ్య, పాండ్ర వెంకటేశం, చింతలగారి కృష్ణ, నెల్లి కిష్టయ్య, సంజీవరావు, మల్లేశం, వినోద్‌నాయక్, సోమనర్సింహులు, చెలం యాదగిరి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.